టాలీవుడ్ హైపర్ ట్యాలెంటెడ్ హీరోల్లో ఒకడైన మంచు మనోజ్.. త్వరలోనే పెళ్ళి పీటలెక్కనున్నాడు. త్వరలోనే కొత్త జీవితంలోకి ప్రవేశపెడుతున్నట్లు ఇటీవలే ప్రకటించిన అతడు.. తాజాగా తన పెళ్ళి తేదీని లాక్ చేశాడని సమాచారం. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఫిబ్రవరి 2, 2023లో మనోజ్ రెండో వివాహం చేసుకోబోతున్నట్టు టాక్ నడుస్తుంది. అటు సినిమాల పరంగానూ అతడు దూకుడుగా ఉన్నాడని.. ఇప్పటికే పలు కథలను ఓకే చేసి పట్టాలెక్కించాడని సమాచారం.