న్యూఢిల్లీ: వినియోగదారుల డేటాను ఫేస్‌బుక్‌తో పంచుకునేలా తీసుకొచ్చిన వాట్సాప్ అప్డేట్ పాలసీపై గుర్రుగా ఉన్న వాట్సాప్ వినియోగదారులు ‘సిగ్నల్’ మెసేజింగ్ యాప్‌పై ఆసక్తి చూపుతున్నారు.
వాట్సాప్ ప్రత్యామ్నాయం కొరకు చూస్తున్న వినియోగదారులకు సిగల్న్ ఒక వరంలా కనిపించింది. వినియోగదారుల గోప్యతను కాపాడుతామని హామీ ఇవ్వడంతో ‘సిగ్నల్’ వైపు అడుగులు పడుతున్నాయి.
ఇప్పటికే సిగ్నల్ మెసేజింగ్ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టులు, యాక్టివిస్టులు, లాయర్లు, పరిశోధకులు, అసమ్మతివాదులు, రాజకీయనాయకులు, భద్రతా నిపుణులు ఉపయోగిస్తున్నారు.
అమెరికన్ విజిల్ బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడెన్, ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీ తదితరుల సపోర్టింగ్ బలంగా ఉన్న ఈ యాప్, ఆండ్రాయిడ్, ఐవోఎస్‌లలో అందుబాటులో ఉంది.
ఐపాడ్లకూ అందుబాటులో ఉంది. అలాగే, వాట్సాప్‌లానే విండోస్, లినక్స్, మ్యాక్ యూజర్లు కూడా సిగ్నల్ యాప్‌ను డౌన్లోడ్, ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
వాట్సాప్ తన ప్రైవసీ పాలసీని లాంచ్ చేసిన తర్వాత ప్రపంచ సంపన్నుడైన టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ స్పందిస్తూ వాట్సాప్‌ను వదిలిపెట్టి ‘సిగ్నల్’ను ఎంచుకోవాలని సూచించాడు. ముఖ్యంగా భారత్‌లో విశేష స్పందన లభించింది. సిగ్నల్‌కు డౌన్లోడ్లు పోటెత్తాయి.
ఫలితంగా వాట్సాప్‌ను వెనక్కి నెట్టేసి, యాప్‌స్టోర్‌లో దేశంలోనే టాప్ ఫ్రీ యాప్‌గా అవతరించింది. సిగ్నల్ యాప్‌ను సిగ్నల్ ఫౌండేషన్ అండ్ సిగ్నల్ మెసేంజర్ ఎల్ఎల్సీ 2014లో అభివృద్ధి చేసింది.
వాట్సాప్ సహ వ్యవస్థాపకుడు బ్రియాన్ యాక్షన్ ఈ సంస్థను స్థాపించి, ప్రస్తుతం సీఈవోగా ఉన్నాడు. 2017లో వాట్సాప్ నుంచి నిష్క్రమించిన మోక్సీ మార్లిన్స్పైక్ సిగ్నల్ సంస్థకు 50 మిలియన్ డాలర్ల విరాళం ఇచ్చాడు.