నవంబర్ నెలలో ఏకంగా 37 లక్షల ఫేక్, స్పామ్ ఖాతాలను తమ ప్లాట్ ఫాం నుంచి తొలగించినట్లు మెటాకు చెందిన వాట్సాప్ బుధవారం ప్రకటించింది. నవంబర్ కంప్లయన్స్ రిపోర్ట్ లో ఈ వివరాలను వాట్సాప్ వెల్లడించింది. నవంబర్ 1 నుంచి నవంబర్ 31 వరకూ 37,16,000ల ఖాతాలను తొలగించామని, ఇందులో 9,90,000 ఖాతాలు స్పామ్ మెసేజింగ్ చేస్తున్నట్లు తామే గుర్తించామని ప్రకటించింది. దేశంలో వాట్సాప్ కు 40 కోట్ల మంది వినియోగదారులు ఉంటే నవంబర్ లో 946 ఫిర్యాదులు అందుకుంది.