మీ చాటింగ్​లు చూడం, కాల్స్​ వినం

కొత్త ప్రైవసీ పాలసీపై వాట్సాప్​ వివరణ

By udayam on January 12th / 7:02 am IST

వాట్సాప్​ ఇటీవల తీసుకొచ్చిన సరికొత్త ప్రైవసీ పాలసీలు ప్రపంచవ్యాప్తంగా విమర్శలు పాలైన నేపథ్యంలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.

మా వినియోగదారుల వ్యక్తిగత సందేశాలు, ఫోటో షేరింగ్​లు, వీడియో, ఆడియో కాల్స్​ను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ షేర్​ చేయమని వెల్లడించింది.

ఎప్పటి లానే మా వినియోగదారులు తమ స్నేహితులు, ఆఫీస్​ సహాద్యాయులు, కుటుంబ సభ్యులతో షేర్​ చేసుకునే చాటింగ్​ కానీ, వీడియో, ఆడియోలు, ఫొటోలు కానీ ఎండ్​ – టు ఎండ్​ – ఎన్​క్రిప్షన్​తో నే ఉంటాయి. వాటిని మేం కానీ, మా పేరెంట్​ సంస్థ ఫేస్​ బుక్​ కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చదవం, చూడం అని వాట్సాప్​ ట్వీట్​ చేసింది.

‘‘మీరు ఏదైతే షేర్​ చేసుకుంటారో అది మీ మద్యనే ఉంటుంది” అని వివరణ ఇచ్చింది.

అంతే కాకుండా తమ వద్ద ఉన్న 200 కోట్ల మంది వినియోగదారుల సమాచారాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సేవ్​ చేసి ఉంచమని, బయట ప్రచారం జరుగుతున్నదంతా రూమర్లు మాత్రమేనని స్పష్టం చేసింది.