తన యూజర్లకు రోజుకో కొత్త ఫీచర్ ను పరిచయం చేస్తున్న వాట్సాప్ తాజాగా మరో సూపర్ ఆప్షన్ ను అందుబాటులోకి తేనుంది. మన ఫ్రెండ్స్ పెట్టే స్టేటస్ లు మీకు నచ్చకపోతే ఇకపై వాటిని రిపోర్ట్ చేయొచ్చంటూ పేర్కొంది. ఇలాంటి ఫీచర్ తో తమ ప్లాట్ ఫాం ను మరింత ఎంగేజింగ్ మార్చేందుకు వాట్సాప్ నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటోంది. ఈ కొత్త ఫీచర్ తో తమ ప్లాట్ ఫాంలో మరిన్ని స్పామ్ ఖాతాలను ఫిల్టర్ చేయగలమని వాట్సాప్ వెల్లడించింది.