యూజర్లు భారీ సైజు ఫైల్స్‌ను కూడా పంపుకునేలా వాట్సాప్ తన యాప్‌ను అప్డేట్ చేసింది. ఇప్పటి వరకూ కేవలం 100 ఎంబి ఫైల్స్‌ను మాత్రమే షేర్ చేసుకునే అవకాశం ఉండగా.. ఇప్పుడు దానిని 2 జిబి వరకూ పెంచేసింది. ఇప్పటికే చాలా మంది యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రాగా రానున్న వారాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకూ ఈ ఫీచర్ యాడ్ కానుంది.