ఈ ఏడాది అక్టోబర్ 24 నుంచి కొన్ని ఐఫోన్లలో వాట్సాప్ సేవలు బంద్ కానున్నాయి. వాబీటా ఇన్ఫో సంస్థ రిపోర్ట్ ప్రకారం యాపిల్ ఇప్పటికే ఈ విషయమై పాత ఐఫోన్ యూజర్లకు మెసేజ్లు కూడా పంపింది. ఐఓఎస్ 10, ఐఓఎస్ 11 సాఫ్ట్వేర్లతో పనిచేసే ఐఫోన్లలో అంటే ఐఫోన్ 5, ఐఫోన్ 5సి లలో వాట్సాప్ సేవలు అక్టోబర్ 24 నుంచి నిలిపివేస్తున్నట్లు ఈ మెసేజ్ సారాంశం. యాపిల్ ఇటీవలే ఐఓఎస్ 15ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.