అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మనవరాలు పెళ్లి అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో ఘనంగా జరిగింది. తన ప్రియుడైన పీటర్ నీల్ ను నవోమి బైడెన్ వివాహమాడింది. ఈ వివాహనికి పరిమిత సంఖ్యలో అతిథులను అహ్వానించారు. 2021లో పీటర్ నీల్, నవోమి బైడెన్ ఎంగేజ్మెంట్ జరిగింది. వైట్హౌస్లో గత పదేళ్లలో పెళ్లి వేడుక జరగడం ఇదే తొలిసారి. అయితే వైట్ హౌస్ లో జరిగిన 19వ వివాహమిది. వైట్‌హౌస్‌లో అధ్యక్షుడి మనవరాలు పెళ్లి జరగడం ఇదే ప్రథమం. ఇంతకుముందు అధ్యక్షుడి కుమార్తెల వివాహాలే జరిగాయి.