ముగ్గురు పిల్లల్ని కన్న తెల్ల పులి

By udayam on May 10th / 6:24 am IST

మైసూరులోని చామరాజేంద్ర జంతు ప్రదర్శన శాలలో ఉన్న ఓ తెల్ల ఆడ పులి మూడు పిల్లలకు జన్మనిచ్చిందని జూ అధికారులు తెలిపారు. దీంతో ఆ నగరంలోని జంతు పరిరక్షణ సంఘాలు జూకు వెళ్ళి పులి పిల్లలను చూసి మురిసిపోతున్నారు. వీటికి సంబంధించిన ఫొటోలో నెట్లో వైరల్​గా మారాయి. 8 ఏళ్ళ ఆడ పులి తారిలికి 4 ఏళ్ళ మగ పులి రాకీకి ఈ పిల్లలు పుట్టాయని జూ అధికారులు తెలిపారు. ప్రస్తుతం తల్లి, పిల్లల కోసం ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు జూ సిబ్బంది వెల్లడించారు.

ట్యాగ్స్​