పంత్ యాక్సిడెంట్​: ఢిల్లీ పగ్గాలు దక్కేదెవరికో!

By udayam on December 30th / 11:48 am IST

యువ క్రికెటర్​ రిషబ్​ పంత్​ కు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన తర్వాత ఇప్పుడు ఐపిఎల్​ లో ఢిల్లీ క్యాపిటల్స్​ జట్టుకు ఎవరు కెప్టెన్సీ వహిస్తారన్నది పెద్ద ప్రశ్న ఎదురవుతోంది. మరో మూడు నెలల్లో ప్రారంభం కానున్న ఈ సిరీస్​ కు పంత్​ పూర్తి ఫిట్​ నెస్​ సాధించే అవకాశాలు కనిపించడం లేదు. ఒకవేళ అతడు ఈ సిరీస్​ కు దూరంగా ఉన్నట్లయితే ఆ జట్టులోని ఆసీస్​ సీనియర్​ క్రికెటర్​ డేవిడ్​ వార్నర్​ ఢిల్లీకి కెప్టెన్​ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అతడి తర్వాత భారత ప్లేయర పృధ్వి షా, ఆసీస్​ ప్లేయర్​ మిచెల్​ మార్ష్​ కు.. కోచ్​ పాంటింగ్​ పగ్గాలు ఇవ్వనున్నాడని సమాచారం.

ట్యాగ్స్​