డివిలియర్స్​: అభిమానుల కోసం బెంగళూరుకు తొరిగొస్తా

By udayam on October 4th / 10:49 am IST

లెజెండరీ సౌతాఫ్రికా క్రికెటర్​ ఎబి డివిలియర్స్​ తిరిగి బెంగళూరు రాయల్​ ఛాలెంజర్స్​ జట్టుతో కలవనున్నాడు. అయితే అతడు క్రికెటర్​గా కాదు వచ్చేది.. కేవలం ఓ పాత కొలీగ్​గా మాత్రమే అతడు 2‌‌023 ఐపిఎల్​ సీజన్​లో చిన్నస్వామి స్టేడియానికి తిరిగొస్తానని చెప్పుకొచ్చాడు. 2008–11 వరకూ ఢిల్లీ జట్టుకు ఆడిన అతడు ఆపై వరుసగా పదేళ్ళ పాటు ఐపిఎల్​లో బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ క్రమంలో 2021 సీజన్​ తర్వాత రిటైర్మెంట్​ ఇచ్చేసిన అతడు అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో కుడి కంటికి ఆపరేషన్​ చేయించుకోవడంతో ఇకపై ప్రొఫెషనల్​ క్రికెట్​ శాశ్వతంగా దూరమయ్యాడు.

ట్యాగ్స్​