దేశంలో కొవిడ్ పరిస్థితులు చక్కబడ్డ అనంతరం సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ (సిఎఎ)ను అమలు చేసి తీరతామని హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఉత్తర బెంగాల్లోని సిలిగురిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన ఈ చట్టం అమలుపై కేంద్రం వెనకడుగు వేసే ప్రశక్తే లేదని పేర్కొన్నారు. ఈ చట్టం అమలయ్యేది లేదని బెంగాల్ సిఎం మమతా బెనర్జీ అసత్య ప్రచారం చేస్తున్నారన్న ఆయన.. దేశం పొరుగు దేశ వాసుల పాలవ్వడం మీకు సమ్మతమేనా? అని దీదీని ప్రశ్నించారు.