మస్క్​ : త్వరలోనే ట్విట్టర్​ సీఈఓగా దిగిపోతున్నా

By udayam on December 21st / 8:11 am IST

ట్విట్టర్​ ను కొనుగోలు చేసి పట్టుమని పది రోజులు కూడా ఆ కంపెనీ సీఈఓగా నిలబడలేకపోయాడు ఎలన్​ మస్క్​. తాజాగా ఆ పదవి నుంచి తాను తప్పుకోవాలా? అంటూ పెట్టిన పోలింగ్​ లో అతడికి వ్యతిరేకంగా 57.5 శాతం మంది ఓటేయడంతో తాను ఈ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. సీఈవో పదవికి రిజైన్​ చేసిన తర్వాత తాను ట్విట్టర్​ సాఫ్ట్​ వేర్​, సర్వర్స్​ టీమ్​ లపై పనిచేస్తానని చెప్పుకొచ్చాడు. ‘కొత్త పిచ్చోడు దొరకగానే ఈ పదవి నుంచి దిగిపోతా’ అంటూ ట్వీట్​ చేశాడు.

ట్యాగ్స్​