కేజ్రీవాల్​: 80 శాతం ఢిల్లీని నేలకూల్చుతారా?

By udayam on May 16th / 9:47 am IST

ఢిల్లీలో బిజెపి ప్రభుత్వం జరుపుతున్న బుల్డోజర్​ దాడులపై సిఎం కేజ్రీవాల్​ తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాజధాని ఢిల్లీలో 80 శాతం కట్టడాలు ఆక్రమిత ప్రాంతాల్లోనే ఉన్నాయన్న ఆయన.. గత 70 ఏళ్ళుగా ఎవరూ ఈ నగరాన్ని క్రమపద్దతిలో నిర్మించడానికి ప్రయత్నించలేదన్నారు. ‘మీరు 80 శాతం ఢిల్లీని నేల కూల్చాలని చూస్తున్నారా? మీ బుల్డోజర్లు అప్పటి దాకా ఆగవా?’ అని ప్రశ్నించారు. ఢిల్లీ ఉత్తర, తూర్పు, దక్షిణ మున్సిపాలిటీల్లో జరుగుతున్న ఆక్రమణల కూల్చివేతను ఆయన ప్రశ్నించారు.

ట్యాగ్స్​