2 లక్షల ఐసియు బెడ్లు సిద్ధం : కేంద్రం

By udayam on September 13th / 11:02 am IST

దేశవ్యాప్తంగా పండుగల సీజన్​ ప్రారంభమవుతున్న నేపధ్యంలో కొవిడ్​ రోగుల కోసం 2 లక్షలకు పైగా ఐసియు బెడ్లను సిద్ధం చేసినట్లు కేంద్రం తెలిపింది. వీటిలో లక్ష బెడ్లకు ఆక్సిజన్​ సదుపాయం కూడా ఉందని ప్రకటించింది. మరో 40 వేల బెడ్లకు వెంటిలేటర్​ సదుపాయాలు ఉన్నాయని పేర్కొంది. దేశంలోని అన్ని జిల్లాల్లోని ప్రధాన ఆసుపత్రుల్లో ఈ ఏర్పాట్లు చేశామని ప్రభుత్వ ఆరోగ్య శాఖకు చెందిన ఓ సీనియర్​ అధికారి వెల్లడించారు. దాంతో పాటు మరింత మంది ఆరోగ్య కార్యకర్తల్ని విధుల్లోకి తీసుకోనున్నామని తెలిపారు.

ట్యాగ్స్​