ఎన్నికల సంఘం తెలుగు రాష్ట్రాలకు సంబదించిన ఓటర్ల జాబితాను గురువారం విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,99,92,941కి చేరుకోగా.. ఏపీలో 3,99,84,868 గా ఈసీ లెక్క కట్టింది. తెలంగాణ లో ఓటు హక్కు ఉన్న మగవారి సంఖ్య 1,50,48,250 గా ఉంటే.. ఆడవారి సంఖ్య 1,49,24,718 గా ఉంది. ఏపీలో పురుష ఓటర్ల సంఖ్య- 2,01,32,271గా ఉంటే.. మహిళా ఓటర్ల సంఖ్య 2,02,19,104 ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. ఏపీలో అత్యధిక ఓటర్లు ఉన్న జిల్లాగా కర్నూలు (19,42,233) నిలిస్తే.. తెలంగాణలో అత్యధిక ఓటర్లు ఉన్న జిల్లాగా హైదరాబాద్ ( 42,15,456) గా నిలిచింది.