సౌతాఫ్రికా: ఆ 500 క్యారెట్ల డైమండ్​ ఇచ్చేయండి

By udayam on September 20th / 6:07 am IST

బ్రిటన్​ మహరాణి క్వీన్​ ఎలిజబెత్​–2 మరణానంతరం ఆమె కిరీటాల్లో పొందుపరిచిన విదేశాలకు చెందిన వజ్రాలను తిరిగి ఇచ్చేయాలని ఆయా దేశాలు డిమాండ్లు చేస్తున్నాయి. ఇప్పటికే భారత్​ నుంచి తీసుకెళ్ళిన కోహినూర్​ కోసం ఆన్​లైన్​ వేదికగా ఉద్యమాలు జరుగుతుంటే వీటికి సౌతాఫ్రికా సైతం వంతపాడింది. తమ దేశంలో 1905లో వెలికి తీసిన 513 క్యారెట్ల ‘గ్రేట్​ స్టార్​ ఆఫ్​ ఆఫ్రికా’ అనే డైమండ్​ను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్​ చేస్తోంది. అప్పట్లో ఈ డైమండ్​ను సౌతాఫ్రికాని పాలించిన బ్రిటన్​ పాలకులు రాణికి బహుమతిగా పంపించారు.

ట్యాగ్స్​