మహారాష్ట్రలోని రాయ్ఘడ్లో ఆరుగురు చిన్నారులతో సహా తల్లి బావిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో చిన్నారులంతా చనిపోగా తల్లి ప్రాణాలతో బయటపడింది. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో తల్లి బావి నుంచి ప్రాణాలతో బయటకు వచ్చిందని, ఈ ఘటనకు కారణాలపై ఆరా తీస్తున్నామని రాయిఘడ్ పోలీసులు తెలిపారు.