7 ఏళ్ళుగా కోమాలోనే ఉంటున్న ఓ మహిళ ఆసుపత్రి బిల్లు చూస్తే కళ్ళు తిరగక మానదు. బెంగళూరు ఆసుపత్రి వైద్యులు ఏకంగా ఆమె వైద్యానికి రూ.9.5 కోట్ల బిల్లు వేశారు. కేరళకు చెందిన రాజేశ్ నాయర్, పూనమ్ రాణా దంపతులు బెంగళూరులో నివాసం ఉంటున్నారు. పూనమ్‌కు 2015 అక్టోబర్ 2న కడుపు నొప్పి వచ్చి ఆపై ఆమె కోమాలోకి జారుకుంది. ఈనెల 24న పరిస్థితి విషమించి మృతి చెందింది. దీంతో 7 ఏళ్ళుగా జరిగిన ట్రీట్మెంట్కు 9.5 కోట్ల బిల్లు వేసింది ఆసుపత్రి.