సూర్యాపేట : బాత్రూమ్​లో రహస్య కెమెరా

By udayam on May 6th / 7:17 am IST

సూర్యాపేట జిల్లా చివ్వెంల పరిధిలో కుడకడ రోడ్​లోని స్విమ్మింగ్​ పూల్​లో అసభ్యకర సంఘటన చోటు చేసుకుంది. అక్కడి మహిళల బాత్​రూమ్​లో ఓ వ్యక్తి కెమెరాను ఫిక్స్​ చేసి మహిళల వీడియోలను రికార్డ్​ చేశాడు. స్విమ్మింగ్​ పూల్​కు వచ్చి బట్టలు మార్చుకుంటుండగా ఓ యువతి ఈ సంగతిని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటికే 41 నిమిషాల వీడియో రికార్డ్​ అయి ఉందని పోలీసులు గుర్తించారు. పూల్​ వద్ద పనిచేసే మహేష్​ని నిందితుడిగా గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్​ చేశారు.

ట్యాగ్స్​