మధ్యప్రదేశ్ లో ఈరోజు ఓ చిన్నారి నాలుగు కాళ్ళతో జన్మించింది. గ్వాలియర్ జిల్లాలో ఆర్తి కుశ్వాహా అనే మహిళ ఈ పాపను ప్రసవించింది. ప్రస్తుతం పాప ఆరోగ్యం బాగుందని, బరువు 2.3 కేజీలు మాత్రమే ఉందని వైద్యులు తెలిపారు. మెడికల్ టెర్మ్ లో ఇలా నాలుగు కాళ్ళతో పుట్టడాన్ని ఇస్చియోపోగస్ అని పిలుస్తారు. చిన్నారి ఎంబ్రియో రెండు భాగాలుగా విడిపోయి.. చెరో వైపు పెరుగుదల ఉంటుందని వైద్యులు తెలిపారు.