ఆమె ఇంట్లో దొరికిన 90 పాములు

By udayam on October 18th / 6:38 am IST

మన ఇంట్లోని ఓ గదిలో పాము ఉందని తెలిస్తే జీవితంలో ఎన్నిసార్లు ఆ గదిలోకి వెళ్ళినా అదే విషయం గుర్తొస్తుంది. అలాంటిది ఓ మహిళ తన ఇంట్లో ఏకంగా 90 పాముల్ని (రేటల్​స్నేక్స్​)ని గుర్తించింది. ఉత్తర కరోలినాలోని ఓ ఇంటి అడుగు భాగంలో ఈ పాముల గుట్టను ఆమె గుర్తించి బయటకు పరుగులు పెట్టింది. రెప్టైల్​ రెస్క్యూ సిబ్బంది వచ్చి ఆ ఇంటి నుంచి మొత్తం 92 పాముల్ని పట్టుకున్నారు. వీటిల్లో 22 పెద్ద పాములు కాగా 59 పిల్లలు. ఇంటి నుంచి పాముల్ని తీసేసినా తనకు ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే ఇప్పటికీ భయంగానే ఉంటోందని ఆ మహిళ చెప్పుకొచ్చింది.

ట్యాగ్స్​