ఎయిర్​ ఇండియా: నో ఎంట్రీ చెప్పడంతో కుప్పకూలిన మహిళ

By udayam on May 11th / 11:53 am IST

ఎయిర్​ ఇండియా విమానంలో తనను ఎక్కనివ్వలేదన్న ఆవేదనతో ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయిన ఘటన ఢిల్లీ ఎయిర్​పోర్ట్​లో చోటు చేసుకుంది. దీనిని ఆమె బంధువులు వీడియో తీయడంతో విషయం బయటపడింది. ఆమె కుప్పకూలినా విమానాశ్రయ సిబ్బంది ఒక్కరు కూడా ఏమీ పట్టనట్లే వ్యవహరించడం వీడియోలో కనిపించింది. టెక్నికల్​ సమస్యలతోనే ఆమెను విమానంలోకి ఎక్కకుండా అడ్డుకున్నామని ఎయిర్​ ఇండియా వివరణ ఇచ్చింది. బోర్డింగ్​ గేట్​ మూసేసిన తర్వాత రావడంతోనే వారిని విమానంలోకి ఎక్కనివ్వలేదని చెప్పుకొచ్చింది.

ట్యాగ్స్​