మహిళా క్రీడాకారిణులకు బాత్​రూమ్​లో భోజనాలు

By udayam on September 20th / 7:28 am IST

ఉత్తర ప్రదేశ్​లో మహిళా క్రీడాకారిణుల పట్ల అక్కడి అధికారుల అనుచిత ప్రవర్తనపై దేశం మొత్తం దుమ్మెత్తిపోస్తోంది. ఇటీవల ముగిసిన అండర్​–17 బాలికల కబడ్డీ టోర్నమెంట్​ సందర్భంగా వచ్చిన 200 మంది క్రీడాకారిణులకు బాత్ రూమ్​లో భోజనాలు ఏర్పాటు చేశారు. టాయిలెట్​ గదిలో అన్నం, పప్పు, కూరలు ఉంచి వడ్డించగా.. చపాతీలను నేలపై ఓ పేపర్​ పెట్టి అందులో ఉంచారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్​గా మారడంతో క్రీడా అధికారి అనిమేశ్​ సక్సేనా స్పందించారు. అది బాత్​రూం కాదని, ఛేంజింగ్​ రూమ్​ అని.. కవర్​ చేసుకున్నారు.

ట్యాగ్స్​