ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలో నిన్న రైతు భరోసా సభలో ఎపి సిఎం జగన్ మోహన్ రెడ్డికి తీవ్ర అవమానం ఎదురైంది. సభలో ఆయన సుదీర్ఘంగా మాట్లాడుతున్న సమయంలో వచ్చిన మహిళలందరూ తిరిగి వెళ్ళిపోవడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. సంక్షేమ పథకాల పేరుతో లక్షల కోట్లను ఇస్తున్నామని ఆయన ఓ పక్క చెబుతున్నా.. వినడానికి వారెవరూ ఇష్టపడలేదు. కనీసం మంచినీళ్ళ ప్యాకెట్లు కూడా ఇవ్వలేదని కొందరు, మమ్మల్ని బలవంతంగా తీసుకొచ్చారని మరికొందరు మహిళలు చెబుతున్నారు.
జగన్ దెబ్బకి జనం పరార్.. రైతుల్ని దగా చేసిన జగన్ రెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు అనడానికి ఇంత కన్నా ఆధారాలు కావాలా? pic.twitter.com/jwjlQphB7R
— Lokesh Nara (@naralokesh) May 16, 2022