కరోనాపై ప్రపంచం విఫలం

By udayam on July 21st / 9:31 am IST

కొవిడ్​ను ఎదుర్కోవడంలో ప్రపంచ దేశాలన్నీ విఫలమయ్యాయని డబ్ల్యుహెచ్​ఓ చీఫ్​ టెడ్రోస్​ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇందువల్లే 2020లో జరగాల్సిన ఒలింపిక్స్​ క్రీడలు ఏడాది ఆలస్యంగా ప్రారంభమవుతున్నాయన్న ఆయన రెండు రోజుల్లో మొదలయ్యే ఈ క్రీడోత్సవాన్ని ‘మెసేజ్​ ఆఫ్​ హోప్​’గా అభివర్ణించారు. ‘కరోనాతో 40 లక్షల మంది మరణించారు. ఇంకా మరణిస్తూనే ఉన్నారు. ఈ ఏడాదిలో సంభవించిన మరణాలు గతేడాదికి రెండు రెట్లుగా ఉన్నాయి. ప్రపంచం విఫలమైందనడానికి ఇవే సంకేతాలు’ అని టెడ్రోస్​ అన్నారు.

ట్యాగ్స్​