ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్గా మరోసారి టెడ్రోస్ అథనోమ్ ఎంపికయ్యారు. మరో ఐదేళ్ళ పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నట్లు ఏఎఫ్పీ రిపోర్ట్ చేసింది. ఆఫ్రికాలోని ఇథియోపియా దేశానికి చెందిన టెడ్రోస్ పదవీకాలం ముగుస్తుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్షిక సమావేశం నిర్వహించి తిరిగి ఆయననే చీఫ్గా ఎన్నుకుంది. 2017లో తొలిసారి డబ్ల్యుహెచ్ఓ చీఫ్గా ఎన్నికైన ఆయన ఈ ఏడాది ఆగస్ట్ 16 తర్వాత తిరిగి ఈ పదవిలోనే మరో 5 ఏళ్ళు కొనసాగనున్నారు.