మోదీకి ప్రపంచ నేతల పరామర్శ

By udayam on December 31st / 5:30 am IST

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మృతి పట్ల ప్రపంచ నేతలు సంతాపం ప్రకటించారు. జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా, నేపాల్‌ ప్రధాని ప్రచండ, పాకిస్థాన్​ ప్రధాని షహబాజ్​ షరీఫ్​ లు మోదీకి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. శ్రీలంక మాజీ ప్రధాని మహీంద రాజపక్సే, నేపాల్​ మాజీ ప్రధాని షేర్​ బహదూర్​ దేబా సైతం ప్రధానికి సంతాపం వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు. వీరితో పాటు దేశవ్యాప్తంగా పలు రాజకీయ నాయకులు, వివిధ రాష్ట్రాల సిఎంలు ప్రధానికి సంతాపం తెలిపారు.

ట్యాగ్స్​