వార్నింగ్​: ఐదేళ్ళలో 1.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగొచ్చు

By udayam on May 10th / 9:56 am IST

రాబోయే ఐదేళ్ళలోనే భూగోళం సరాసరి 1.5 డిగ్రీల చొప్పున వేడెక్కనుందని శాస్త్రవేత్తలు తాజాగా హెచ్చరించారు. ఇప్పటికే ఎన్నోసార్లు దీనిపై ప్రపంచ అధినేతల్ని హెచ్చరించినా అవన్నీ చెవుటోడి చెవిలో శంఖం ఊదినట్లే అయింది. అయితే తాజా అంచనాల ప్రకారం 2022–2026 మధ్యలో భూగోళం 1.1 – 1.7 డిగ్రీల మేర ఉష్ణోగ్రతల పెరుగుదలను నమోదు చేయనుందని యుకె మెట్​ ఆఫీస్​ రీసెర్చర్స్​ హెచ్చరిస్తున్నారు. 1.5 డిగ్రీల సరాసరిని దాటే అవకాశాలు దాదాపుగా 50–50గా ఉన్నట్లు పేర్కొంది.

ట్యాగ్స్​