కొత్త సంవత్సరం రోజున ప్రపంచ జనాభా 790 కోట్లకు చేరనుందని అమెరికాకు చెందిన సెన్సస్ బ్యూరో ప్రకటించింది. 2022 జనవరి 1 నుంచి 2023 జనవరి 1 నాటికి ప్రపంచవ్యాప్తంగా 7.37 కోట్ల మంది జన్మించినట్లు పేర్కొంది. దీంతో గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 0.9 శాతం మంది అధికంగా కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొననున్నట్లు వెల్లడించింది. ప్రతీ సెకనుకు ప్రపంచవ్యాప్తంగా 4.3 మంది జన్మిస్తుంటే ఇద్దరు మరణిస్తున్నారని తెలిపింది. జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా 15 లక్షల మంది జన్మించనున్నట్లు తెలిపింది.