వేలానికి ప్రపంచంలోనే అతిపెద్ద వైట్​ డైమండ్​

By udayam on May 7th / 4:34 am IST

ప్రపంచంలోనే అతిపెద్ద వైట్​ డైమండ్​ తొలిసారిగా వేలానికి రానుంది. క్రీస్టీస్​ సంస్థ నిర్వహించే ఈ వేలంలో ఈ 228.31 క్యారెట్ల పీర్​ షేప్​లోని డైమండ్​ 230 కోట్ల రూపాయలు పలుకుతుందని అంచనా. గోల్ఫ్​ బాల్​ సైజుండే ఈ తెల్లని వజ్రం దక్షిణాఫ్రికాలోని గనుల్లో దొరికింది. దీంతో 205.07 క్యారెట్ల పసుపు డైమండ్​ను సైతం రెడ్​క్రాస్​ సొసైటీకి విరాళం ఇవ్వడానికి క్రిస్టీస్​ వేలం వేయనుంది. 1918లో ఈ కుషన్​ ఆకారంలోని పసుపు డైమండ్​ను ఇదే సంస్థ తొలిసారి వేలం వేసింది.

ట్యాగ్స్​