కామన్ వెల్త్ పోటీల ట్రయల్స్‌లో గెలిచే మ్యాచ్‌ను ఓడిపోయానన్న ఆవేదనలో రెజ్లర్ సతేంజర్ మాలిక్ రిఫరీ జగ్బీర్ సింగ్‌పై చేయి చేసుకున్నాడు. మోహిత్ తో జరిగిన 125 కేజీల ఫైనల్లో సతేందర్ సింగ్ ఒకానొక సమయంలో 3–0తో ఆధిక్యంలో ఉన్నాడు. ఆపై మోహిత్ సతేందర్‌ను మ్యాట్ నుంచి గెంటేయగా అతడికి ఒక పాయింట్ దక్కింది. దీనిపై మోహిత్ రివ్యూకు వెళ్ళి 3 పాయింట్లు గెల్చుకున్నాడు. దీనిని సీరియస్‌గా తీసుకున్న డబ్ల్యుఎఫ్ఐ అతడిపై జీవితకాల నిషేధం విధించింది.