చైనా వ్యతిరేక వార్తల్ని తగ్గిస్తున్న షియామీ ఫోన్లు!

By udayam on September 23rd / 6:30 am IST

చైనా టాప్​ స్మార్ట్​ఫోన్​ కంపెనీ షియామీలో చైనా వ్యతిరేక వార్తల్ని సెన్సార్​ చేస్తున్నారన్న విషయం తాజాగా బయటకొచ్చింది. లిథువేనియా రక్షణ మంత్రిత్వ శాఖ తొలిసారిగా ఈ విషయాన్ని వెల్లడించింది. తైవాన్​ స్వాతంత్రం, టిబెట్​ స్వేచ్ఛ వంటి వార్తల ప్రసారాన్ని షియామీ ఫోన్లలో ఆటోమేటిక్​గా సెన్సార్​ జరుగుతోందని తెలిపింది. యూరోపియన్​ యూనియన్​ ప్రాంతంలో ఇలాంటి సెన్సార్లను నిలిపివేస్తున్నప్పటికీ చైనా నుంచి రిమోట్​గా తిరిగి యాక్టివేట్​ అవుతున్నాయని తెలిపింది. షియామీ ఇటీవల విడుదల చేసిన ఎంఐ 10టి 5జి ఫోన్​ను టెస్ట్​ చేసి తాము ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నట్లు ప్రకటించింది.

ట్యాగ్స్​