బాక్సాఫీస్‌పై రాఖీ భాయ్ దండయాత్ర కొనసాగుతూనే ఉంది. కేజీఎఫ్ ఛాప్టర్ 2 తాజాగా బాహుబలి 2 రికార్డులను తిరగరాసింది. టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షో లో 17.1 మిలియన్ల ఛాప్టర్2 టికెట్లు అమ్ముడుపోయాయి. ఇప్పటి వరకూ బాహుబలి పేరిట ఉన్న 17 మిలియన్ల టికెట్ బుకింగ్స్‌ను రాఖీబాయ్ క్రాస్ చేసేశాడు. యశ్ హీరోగా నటించిన ఈ మూవీలో విలన్‌గా సంజయ్ దత్ అదరగొట్టాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ రూ.1300ల కోట్ల కలెక్షన్ల వైపు దూసుకుపోతోంది.