అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారు. రూ. 500 కోట్లతో ఈ కాలేజీని నిర్మించనున్నారు. రూ. 470 కోట్లతో నిర్మించే తాండవ-ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధాన ప్రాజెక్ట్ పనులకు, రూ. 16 కోట్లతో నర్సీపట్నం రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా పవన్, చంద్రబాబులపై విమర్శలు చేసిన ఆయన చంద్రబాబు డైలాగులకు పవన్ యాక్టింగ్ చేస్తారని, ఈ భార్య కాకపోతే మరో భార్య అన్నట్టుగా పవన్ రాజకీయ జీవితం సాగుతోందన్నారు.
ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి?#CMYSJagan #YSJaganInNarsipatnam#MedicalCollege#YSJaganCares pic.twitter.com/mNoXQkAsEI
— YSRCP Digital Media (@YSRCPDMO) December 30, 2022