మాజీ సిఎం చంద్రబాబు గుంటూరు సభలో జరిగిన తొక్కిసలాట కేసులో ఎన్ఆర్ఐ ఉయ్యూరు శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని వైకాపా ఎమ్మెల్యే విమర్శించారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఉయ్యూరు శ్రీనివాస్ మంచి మనిషి అన్న ఎమ్మెల్యే.. కొంత మంది వ్యక్తులు, ఎన్నారైలను కేసుల పేరుతో మన రాష్ట్రంలో కొందరు భయపెడుతున్నారని విమర్శించారు. సేవను రాజకీయ కారణాలతో విమర్శించడం మంచి పద్ధతి కాదన్నారు ఎన్నారైల వల్ల దేశంలో చాలా అభివృద్ధి జరుగుతోందని అభిప్రాయపడ్డారు. వారి సాయాన్ని ఆపాలనుకోవటం అవివేకమవుతోందన్నారు.