మీకు మొబైల్ 4కె స్క్రీన్ కాకపోయినా 4కె వీడియో క్వాలిటీని ఆస్వాదించేలా యూట్యూబ్ తన ఆండ్రాయిడ్ యాప్‌లో మార్పులు చేసింది.
ఈ మేరకు తన సర్వర్‌లో మార్పులు చేసినట్లు యూట్యూబ్ వెల్లడించింది. ఇందుకోసం మీరు ప్లేస్టోర్‌లోని యూట్యూబ్ యాప్‌ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పటికీ ఈ ఫీచర్‌ను ఆపిల్ ఐఓఎస్‌లో గత ఏడాది తీసుకొచ్చిన యూట్యూబ్ తాజాగా ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఫీచర్‌ను అందిస్తోంది. ఇందులో 4కె రిజల్యూషన్ ను 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వేగంతో అందించనుంది.