ఆగిపోనున్న యూట్యూబ్​ గో యాప్​

By udayam on May 4th / 12:29 pm IST

ఆఫ్​లైన్​ వీడియోల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన యూట్యూబ్​ గో యాప్​ను ఆగస్ట్​ నుంచి తొలగిస్తున్నామని యూట్యూబ్​ ప్రకటించింది. ఈ యాప్​ ద్వారా ఆఫ్​లైన్​ వీడియోలను ఎలాంటి నెట్​వర్క్​ లేని ప్రాంతాల్లోనూ షేర్​ చేసుకునే అవకాశాన్ని యూట్యూబ్​ కల్పించింది. అయితే దీనికి అనుకున్నంత ఆదరణ దక్కకపోవడంతో ఈ యాప్​ను తొలగించాలని గూగుల్​ నిర్ణయించింది. ఇకపై యూట్యూబ్​ గో ఓపెన్​ చేస్తే యూట్యూబ్​కు రీడైరెక్ట్​ అవుతారని తన సపోర్టింగ్​ పేజ్​లో ఆ సంస్థ రాసుకొచ్చింది.

ట్యాగ్స్​