ఉక్రెయిన్ యుద్ధ వార్తల్ని కవర్ చేస్తున్న 9 వేల ఛానల్స్‌ను యూట్యూబ్ డిలీట్ చేసిందని ది గార్డియన్ పత్రిక రిపోర్ట్ చేసింది. దీంతో పాటు యుద్ధానికి సంబంధించిన 70 వేల వీడియోలను సైతం యూట్యూబ్ తొలగించినట్లు పేర్కొంది. ఇవన్నీ అత్యంత హింసాత్మకంగా ఉండడమే ఇందుకు కారణమని తెలిపింది. యూట్యూబ్ రూల్స్‌కు విరుద్ధంగా అప్లోడ్ చేయబడ్డ వీడియోలను ఆ ప్లాట్‌ఫామ్ తన ఎఐ టూల్ సాయంతో వెతికి మరీ డిలీట్ చేసి.. ఆ ఛానళ్ళను బ్లాక్ చేసిందని పేర్కొంది.