రాష్ట్రంలోని పేద విద్యార్థుల కోసం ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చిన తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక అడుగు ముందుకేస్తే.. ఆయన కొడుకుగా తాను 4 అడుగులు వేస్తున్నానని సిఎం జగన్ అన్నారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కోసం రూ.10,994 కోట్లను ఖర్చు చేశామన్న ఆయన పిల్లల చదువు విషయంలో అవినీతికి తావులేకుండా చేస్తున్నామన్నారు. విద్యార్థులతో పాటు గర్భిణీలు, బాలింతలు, ఆరేళ్ళ లోపు పిల్లల పౌష్టికాహారం కోసం ప్రతీ ఏటా రూ.1800 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు.