వెంటనే బీమా డబ్బులు అందాలి : సిఎం

By udayam on June 9th / 10:53 am IST

వైఎస్​ఆర్​ బీమా పథకంలో ఉన్న లబ్దిదారులకు కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే తక్షణం బీమా డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలని సిఎం జగన్​ సూచించారు. 18 నుంచి 50 ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తి సహజంగా మరణిస్తే రూ.1 లక్ష, అదే సంపాదిస్తున్న వ్యక్తి 18 – 70 మధ్య ఉండి ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు ఆర్ధిక సాయం ఈ పథకం కింద అందనుంది. బీమా పరిహారానికి దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లోనే వారికి ఆ డబ్బులు చెల్లించాలని సిఎం అధికారులకు ఆదేశించారు.

ట్యాగ్స్​