ఎపి సిఎం వైఎస్ జగన్ ఈనెల 28న కుటుంబంతో సహా పారిస్‌కు బయల్దేరి వెళ్ళనున్నారు. ఆయన పెద్ద కూతురు హర్షా రెడ్డి అక్కడ బిజినెస్ స్కూల్లో పిజి (ఎంబిఎ) పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగే కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. 29న పారిస్‌లో దిగే ఆయన జులై 2న తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు చేరుకోనున్నారు. తన విదేశీ పర్యనకు అనుమతి కోసం 10 రోజుల క్రితమే జగన్ సిబిఐకు సైతం విజ్ఞప్తి పంపారు. అయితే ఆయన విజ్ఞప్తిని కోర్టు దృష్టికి తీసుకెళ్ళిన సిబిఐ.. వివిధ కారణాలతో ఆయన విదేశాలకు వెళ్తూనే ఉన్నారని అభ్యంతరం వ్యక్తం చేసింది.