తాను చేస్తున్న మహా పాదయాత్ర వల్ల తెలంగాణ సిఎం కేసీఆర్ తో తనకు ప్రాణహాని ఉందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటి వరకు తన పాదయాత్రను మూడు సార్లు అడ్డుకునే ప్రయత్నం చేశారని షర్మిల చెప్పారు. పోలీసులు ప్రజల కోసం కాకుండా… కేసీఆర్ కోసం పని చేస్తున్నారని విమర్శించారు. పోలీసులను సిఎం పనివాళ్లుగా వాడుకుంటున్నారని అన్నారు. నర్సంపేటలో టీఆర్ఎస్ శ్రేణులు దాడులు చేస్తే మాపైనే కేసులు నమోదు చేయడం ఏమిటని ఆమె మండిపడ్డారు.