రేపటి నుంచి షర్మిల​ పాదయాత్ర

By udayam on October 19th / 11:04 am IST

తెలంగాణలోని 90 నియోజకవర్గాల్లో 400 రోజుల పాటు పాదయాత్ర చేయడానికి వైఎస్సార్​టిపి అధినేత్రి వైఎస్​.షర్మిల సిద్దమవుతున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఈ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ మేరకు షర్మిళ ఈరోజు ఇడుపులపాయ వచ్చి తండ్రి వైఎస్సార్​ సమాధి వద్ద నివాళులర్పించారు. చేవెళ్ళ నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రజా ప్రస్థానం పాదయాత్రలో తన కూతురు అడుగులో అడుగు వేయాలని వైఎస్సార్​ అభిమానులకు తల్లి విజయలక్షి వీడియో సందేశంలో పిలుపునిచ్చారు. ప్రతీరోజు ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ ఈ పాదయాత్ర జరగనుంది.

ట్యాగ్స్​