రాజ్యసభ ఎన్నికలు: 4 సీట్లూ ఏకగ్రీవమే!

By udayam on May 14th / 7:57 am IST

వచ్చే నెల 10న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో అధికార వైఎస్సార్​ పార్టీ ఎన్నికలు జరగనున్న 4 స్థానాలను స్వీప్​ చేయనుంది! ప్రస్తుతం వైఎస్సార్​సిపికి అసెంబ్లీలో ఉన్న బలం దృష్ట్యా ఈ నాలుగు సీట్లూ జగన్​ పార్టీ దక్కించుకోనున్నారు. టిడిపికి కేవలం 23 మంది ఎమ్మెల్యేలే ఉండడంతో వారికి ఒక్క సీటూ దక్కకపోవచ్చు. దీంతో ఈ ఎన్నికల్లో టిడిపి అసలు అభ్యర్ధిని నిలబెట్టే ఆలోచన చేయదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎపి నుంచి ఈసారి అదానీ కుటుంబంలో ఒకరు రాజ్యసభకు వెళ్ళనున్నారు!

ట్యాగ్స్​