విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న ఏపి మాజీ సిఎం చంద్రబాబు నాయుడు జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. ఒక రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండాలన్న ఆయన.. విశాఖ.. మన రాష్ట్రానికి ఆర్ధిక, పర్యాటక రాజధానిగా ఎదుగుతుందన్నారు. ‘అమరావతిలో రైతులు 1000 రోజులకు పైబడి ఆందోళనలు చేస్తున్నా పట్టింకోవడం లేదు.. అక్కడ రూ.3 లక్షల కోట్ల సంపదను ఆవిరి చేశారు. ఉద్యోగులకు జీతాలూ నెల మొదట్లో ఇవ్వలేని పరిస్థితికి తెచ్చారు. అయినా మూడు రాజధానలు కడతామని చెప్పుకుంటున్నారు’ అంటూ ఏపీ సిఎం జగన్ ను నేరుగా విమర్శించారు.