నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అస్వస్థత పాలయ్యారు. శుక్రవారం ఆయనకు గుండెపోటు రావడంతో వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన గోటువారి కండ్రిగ, మన్నవరప్పాడు, ఆమంచర్ల గ్రామాల్లో పర్యటించారు. ఈ సమయంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో అపోలో ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆయనను అక్కడ నుంచి చెన్నైలోని మరో ఆసుపత్రికి తరలించారు.