ఏఈఈ పై చేయి చేసుకున్న ఎమ్మెల్యే రాజా!

By udayam on June 2nd / 7:13 am IST

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా జలవనరుల శాఖలో ఏఈఈ గా పనిచేస్తున్న అధికారిపై చేయి చేసుకున్నారు. నీటిపారుదలకు సంబంధించి జరిగిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే తనను 3 సార్లు చెంపదెబ్బ కొట్టారని ఏఈఈ సూర్యకిరణ్, రాజమండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పుష్కర ఎత్తిపోతల పథకం రివ్యూ జరుగుతుండగా తాను ఇచ్చిన వివరణకు ఆగ్రహం చెందిన రాజా.. ఇతర అధికారుల సమక్షంలో తన మీద చేయి చేసుకున్నారని సూర్యకిరణ్​ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ట్యాగ్స్​