వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్​

By udayam on May 23rd / 5:35 am IST

ఆంధ్రప్రదేశ్​ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్​ చేశారు. ఆయన డ్రైవర్​ సుబ్రహ్మణ్యంను అనుచరులతో కలిసి అనంతబాబు హత్య చేసినట్లు ఆయనపై ప్రధాన ఆరోపణ. నిన్న వచ్చిన సుబ్రహ్మణ్యం పోస్ట్​ మార్టం రిపోర్ట్​లోనూ సుబ్రహ్మణ్యంను చితకబాది ఊపిరాడకుండా చేయడంతో మరణించినట్లు తేలింది. దీంతో ఆదివారం రాత్రి అనంతబాబును అరెస్ట్​ చేసి కాకినాడ ఏఆర్​ హెడ్​క్వార్టర్స్​కు తరలించారు. ఈ హత్యకు సహకరించిన అనంతబాబు అనుచరులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్​