తన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నాడన్న కోపంతోనే డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేశానని ఎమ్మెల్సీ అనంతబాబు అంగీకరించాడు! నిన్న రాత్రి ఏలూరు రేంజ్ డిఐజీ పాలరాజు ఆఫీస్కు స్వయంగా వెళ్లి సరెండర్ అయిన అనంత బాబు ఈ హత్య తానొక్కడినే చేసినట్లు ఒప్పుకున్నారు. బాధిత కుటుంబం మొదటి నుంచీ ఆరోపిస్తున్నట్లే ఈ హత్య తానే చేసినట్లు ఎమ్మెల్సీ ఒప్పుకోవడం గమనార్హం. అయితే ఈ కేసును సిబిఐకి అప్పగించాలని టిడిపి నేత నారా లోకేష్, వామపక్ష, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.